Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Sep-2016 15:49:27
facebook Twitter Googleplus
Photo

అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సడన్ గా తన తమిళ ఎంట్రీ గురించి ప్రకటించేశారు. హీరో సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా ప్రొడక్షన్లో లింగుస్వామి డైరక్షన్లో.. తన తొలి తెలుగు-తమిళ్ బైలింగువల్ రాబోతుందని బన్నీ సెలవిచ్చాడు. ప్రెస్ కూడా పెట్టేశాడు. అయితే ఈ సినిమాను ఇంత త్వరగా ప్రకటించేయడం వెనుక ఒక స్ర్టాంగ్ రీజన్ ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఎప్పటినుండో బన్నీకి కథ చెప్పేసి లింగుస్వామి వెయిటింగులోనే ఉన్నాడు. ఆయన బన్నీతో సినిమా చేయబోతున్నా అంటున్నాడు కాని.. మధ్యలో బన్నీ మాత్రం ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే లింగుస్వామి ఎన్టీఆర్ ను ఎప్రోచ్ అయ్యాడు అనే రూమర్లు వచ్చాయో వెంటనే ఈ ఇష్యూ సాల్వ్ చేయాలని రంగంలోకి దిగాడట అల్లు అర్జున్. అసలు లింగుస్వామి నిజంగానే ఎన్టీఆర్ ను కలిశాడా లేదా అనే విషయం ఎవ్వరికీ తెలియదు కాని.. వెబ్ మీడియాల్లో రూమర్లు రావడంతో బన్నీ వెంటనే రియాక్ట్ అయ్యి.. లింగుస్వామితో కథ గురించి మరోసారి చర్చించి.. ప్రొడ్యూసర్ గా జ్ఞానవేల్ రాజాను సెట్ చేసి.. వెంటనే ప్రకటన ఇచ్చేశాడని సన్నిహితులు కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఏదేమైనా కూడా ఫిలిం ఇండస్ర్టీలో అంతే.. ఒక సినిమా వేరే హీరో చేస్తున్నాడు అని ఫీలర్లు ఇచ్చినప్పుడే.. కొందరు హీరోలో కాస్త అలర్ట్ అయిపోయి వెంటనే ఆ సినిమాలను సైన్ చేస్తుంటారు. ఈ పాత ప్రిన్సుపుల్ ఇప్పుడు బన్నీ కూడా ఫాలో అయ్యడనేదే కాస్త వింతగా ఉంది.

,  ,  ,  ,  ,  ,