Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2016 13:09:16
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ దగ్గర నుంచి వరుసగా మెగా వేడుకలు బోలెడన్ని జరుగుతున్నాయ్. సరైనోడు ప్రి రిలీజ్ ఫంక్షన్ - రిలీజ్ - పవన్ కొత్త మూవీ ముహూర్తం పూజ - వరుణ్ తేజ్ కొత్త పూజ - అల్లు శిరీష్ పూజ - సాయిధరం తేజ్ మహూర్తం షాట్ - చివరగా మెగాస్టార్ చిరంజీవి కూడా కొత్త సినిమాకి కొబ్బరి కాయ కొట్టేస్తున్నారు. ఇవి కాక ఇంకా తేజు నటించిన సుప్రీం రిలీజ్ కూడా ఉంది.

అయితే.. అసలు విషయం ఏంటంటే మెగా పండగ అని హడావిడి బాగానే ఉంది కానీ.. ఈ సీజన్ లో మెగా ఫ్యామిలీకి కొన్ని అనుకోని అవాంతరాలు కూడా ఎదురయ్యాయి. మొదటగా అల్లు శిరీష్ మూవీ ఒకటి సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో 'త్వరలో నాకు శ్రీరస్తు.. శుభమస్తు' అంటూ ట్వీట్ చేసి హల్ చల్ చేసిన శిరీష్.. తర్వాత మూవీ పోస్టర్ రిలీజ్ చేశాడు. కానీ సమ్మర్ లో షెడ్యూల్ ఖాళీ లేకపోవడంతో ఈ సినిమాకి కనీసం ఓ పోస్టర్ కూడా వేసే పరిస్థితి లేకపోయింది.

ఇక మెగా డాటర్ నీహారిక అరంగేట్రం కోసం ఎదురుచూస్తోంది. ఉగాది రోజున ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తప్ప.. ఈమె ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడీమె నటించిన 'ఒక మనసు' విడుదలకు గ్యాప్ దొరకడం లేదు. మెగా పండగ సంగతి బాగానే ఉంది కానీ.. ఇలాంటి ఎండగలూ తగులుతూ ఉంటాయ్ మరి.

,  ,  ,  ,  ,  ,