Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Oct-2016 11:29:41
facebook Twitter Googleplus
Photo

ఆల్రెడీ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ డిజె- దువ్వాడ జగన్నాథం అంటూ ఒక సినిమాను చేస్తున్నాడు. హరీశ్ శంకర్ డైరక్షన్లో రూపొందే ఈ సినిమాను త్వరలోనే రెగ్యులర్ షూట్ చేస్తారు. అయితే ఈ సినిమాతోపాటు ప్యారెలల్ గా బన్నీ ఇప్పటికీ లింగుస్వామి సినిమా కూడా ఒప్పుకున్నాడు. ఆ సినిమాను ఒకేసారి తెలుగు అండ్ తమిళంలో రూపొందించాలి. ఇవన్నీ కాకుండా ఇంకో సినిమా కూడా ఉందట తెలుసా?

కన్నడలో కేవలం ట్రైలర్ తోనే ప్రభంజనం సృష్టించిన సినిమా ''బద్మాష్''. ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కాని.. ట్రైలర్ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. ఎందుకంటే సినిమాలో హీరో రకరకాల వేషాలు మార్చే ఒక కాన్ మ్యాన్ తరహాలో ఉంటాడు. అతను ఒక పొలిటీషియన్ చేస్తున్న స్కాండల్ కు అనుకోకుండా అడ్డుపడటంతో.. సినిమా రకరకాల మలుపులు తిరుగుతుంది. ఈ ట్రైలర్ ను చూసిన గీతా ఆర్ట్స్ వారు.. వెంటనే నిర్మాతలతో మాట్లాడి సినిమా ప్రివ్యూ చూశారట. వెంటనే ఈ సినిమాను కొనేయమని అల్లు అర్జున్ చెప్పడంతో.. అరవింద్ కొనేసినట్లు టాక్.

అయితే సినిమాను అల్లు అర్జున్ రీమేక్ చేస్తాడా లేకపోతే అల్లు శిరీష్ హీరోగా రీమేక్ చేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాలంటే.. కన్నడలో సినిమా రిలీజై రిజల్టు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి గీతా ఆర్ట్స్ వర్గాలు.

,  ,  ,  ,  ,