Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2017 10:31:26
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ క్రేజ్ సౌత్ కే పరిమితం అని ఇప్పటివరకూ అంతా అనుకున్నారు. కానీ బన్నీ రేంజ్ బాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయిందని.. అక్కడ కూడా తన సినిమాలతో సెన్సేషన్స్ సృష్టించగలడనే విషయం ఇప్పుడే అర్ధమవుతోంది. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రికార్డులను కూడా బన్నీ చిటికెలో తుడిచేస్తున్నాడంటే.. అల్లు అర్జున్ స్పీడ్ అర్ధమవుతుంది.

తాజాగా రిలీజ్ అయిన ట్యూబ్ లైట్ ట్రైలర్ కు 6 మిలియన్ మిలియన్ మార్క్ ను అందుకునేందుకు 6 రోజులు పడితే.. అల్లు అర్జున్ నటించిన సరైనోడు హిందీ డబ్బింగ్ వెర్షన్ కేవలం 24 గంటల్లోనే 6.1 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పటివరకూ మొత్తం 15 మిలియన్లకు పైగా వ్యూస్ ఈ సినిమాకు వచ్చాయి. మే 28న సోనీమాక్స్ లో సరైనోడు పేరుతోనే టెలికాస్ట్ కాగా.. అదే రోజున యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. అక్కడి నుంచి బన్నీ అన్ని రికార్డులు బాదేస్తున్నాడు. మూడు రోజుల్లో 15 మిలియన్ల వ్యూస్ అంటే.. చాలా పెద్ద రికార్డ్. విపరీతమైన డిమాండ్ ఉండే కపిల్ శర్మ కామెడీ షోకి వచ్చిన వ్యూస్ కు.. 3 రెట్ల వేగంతో బన్నీ సరైనోడు దూసుకుపోతోంది.

అంతే కాదు.. యూఏఈ.. ఆస్ట్రేలియా.. బెహ్రెయిన్.. నేపాల్.. బంగ్లాదేశ్.. పాకిస్తాన్ దేశాల్లో యూట్యూబ్ నెంబర్ 1గా నిలిచాడు హిందీ సరైనోడు. 3 రోజుల తర్వాత కూడా టాప్ 20 ట్రెండింగ్ వీడియోస్ లో సరైనోడు నిలిచిందంటే.. ఈ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఏ స్థాయి హిట్ అనే సంగతి అర్ధమవుతుంది. బన్నీ గత చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తికి 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

,  ,  ,  ,  ,