Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2016 12:34:23
facebook Twitter Googleplus
Photo

ఒక చర్చజరుగుతున్నపుడు గతంలో నలుగురిలో ఒకడ్ని పడగొట్టాలంటే స్కెచ్ లు వేసేవారు ప్లాన్ లు వేసేవారు.. అయితే ఇప్పుడు కేవలం ఆయన రాసిన పంచ్ లు వేస్తున్నారు..

ఒక సంఘటనకు సరైన ఉదాహరణ చెప్పాలంటే వెనకటికి చరిత్రలు తవ్వేవారు - పురాణాలు ప్రస్తావించేవారు... ఇప్పుడు ఆయన సినిమాలో సన్నివేశాలు సరిపోతాయంటున్నారు..

అవును ఆయన పోద్దుకుగా పరిచిన ప్రాసల కోటలో కొలువున్న మారాజు..

ఆశ్సీలమైన తెలుగు పదాలకు ఆయనొక బ్యారేజు..

అర్ధవంతమైన అక్షర సంపదలు కలిగి వున్న గ్యారేజు..

అయ్యబాబోయ్... మనం కూడా ప్రాసలు వాడేస్తున్నాం చూసారూ.. ఇదే ఇదే ఆయనలోని గొప్పతనం.. ఆయన సినిమాలలో మాదిరిగానే నిజజీవితంలో కూడా పాలోడు దగ్గరనుండి పాలించేవోడి దాకా అందరూ ప్రాసలు పంచులు వాడడం రివాజుగా మారిపోయింది

మాట అతని మాట వింటుంది.. అతను చెప్పినట్టల్లా ఆడుతుంది..

ఆయన సంభాషణలలో నుడికారాలకంటే వెటకారాలే ఎక్కువుంటాయన్నది జగమెరిగిన సత్యం..

ఉపమానాలు చెప్పడం ఆయనకు ఉప్మా పెసరట్టు తిన్నంత వీజీపని..

వేదాంతాలను ప్రస్తావించినప్పుడు వాటి ఆది అంతాలను పరిచయం చేసి ఆద్యంతం విస్మయపరచడం ఆయనకి పెన్నుతో పెట్టిన విద్య

అతని ఫన్(ఫౌన్)టైన్ పెన్ను నుండి పురుడుపోసుకుంటున్న అక్షరం ఆక్షణం నుండి కొన్ని వేలమంది నోళ్ళలో నానడానికి సిద్ధమవుతుంది

రాగద్వేషాలకు అతీతంగా భావోద్వేగాలను ప్రాముఖ్యతను తన మాటలలో నింపే అతికొద్ది మందిలో ఆయన ఒకరు

పదానికే గనుక ప్రాణముంటే ఆయన పాదాలను తాకుతుంది.. మాటకే గనుక మాటొస్తే తప్పకుండా ఆయన్నే కీర్తిస్తుంది. జ్ఞానానికి గనుక జన్మముంటే అతని చితివరకే తానూ నిలవాలని వరమడుగుతుంది.

మన కాలంలో ఆయన కలంతో లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలకు సృష్టికర్త..

మాటలొచ్చినా తరచూ మాట్లాడని వక్త..

వెరసీ ఒక తరం తెలుగు సినిమాని ఏలిన - ఏలుతున్న - ఏలనున్న పదాల విధాతకు జన్మదిన శుభాకాంక్షలు

,  ,  ,  ,