Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Oct-2016 16:00:02
facebook Twitter Googleplus
Photo

అసలు ''సరైనోడు'' సినిమా హిట్టయ్యాక స్టయిలిష్ స్టార్ ఇంత గ్యాప్ తీసుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. కాని ఈసారి ఎందుకో స్ర్కిప్టు బాగా రావాలనే ఉద్దేశ్యంతో మనోడు చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే చాలా గ్యాప్ తీసుకున్న తరువాత మనోడికి హరీశ్ శంకర్ చెప్పిన కొత్త కథ విపరీతంగా నచ్చేసిందట. అందుకే ఈసారి ముందుగానే టైటిల్ డిసైడ్ చేసేసి.. లోగో డిజైన్ చేయించి.. ఆ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

అదే ''డిజె- దువ్వాడ జగన్నాథం''. కాకపోతే ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులే అయినా కూడా ఇంతవరకు షూటింగ్ కు తీసుకెళ్లలేదు. దసరా సమయానికి షూటింగ్ మొదలవుతుంది అనుకుంటే.. ఎందుకో లేటైంది. ఇక తాజా అప్డేట్ ఏంటంటే.. ఇప్పుడు బన్నీ అండ్ హరీశ్ శంకర్ డేట్ ఫిక్స్ చేసేశారట. వచ్చే గురువారం.. అంటే ఎల్లుండ నుండి (అక్టోబర్ 20) సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టేస్తున్నారట. తొలి షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా పాల్గొంటుందని టాక్.

మొత్తానికి దవ్వాడ వారి కుర్రాడు దూకుడు చూపించేసి.. సినిమాను త్వరత్వరగా పూర్తి చేసేసి.. తనకు అచ్చొచ్చిన సమ్మర్ లో రచ్చ చేయాలనేది ప్లాన్. అయితే ఈసారి మార్చి 31న కాటమరాయుడు.. ఏప్రియల్ 28న బాహుబలి 2 ఉన్నాయి కాబట్టి.. ఆ మధ్య గ్యాప్ లో మరి బన్నీ ఎంతవరకు డేర్ చేసాడతడు అనేదే చూడాల్సిన విషయం.

,  ,  ,