Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2015 17:54:58
facebook Twitter Googleplus
Photo

దాసరి నారాయణరావు తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడని.. తన జీవితంలో తానెవరికైనా రుణపడి ఉన్నానంటే అది దాసరికే అని అన్నారు మోహన్ బాబు. నటుడిగా 40 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటున్న తరుణంలో తన గురువు తనకు నేర్పిన తొలి పాఠాల గురించి.. తనను తీర్చిదిద్దిన తీరు గురించి వివరించారు మోహన్ బాబు.

??నా పేరు మార్చి.. నటుడిగా నాకో జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి దాసరి. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో డైలాగులు చెప్పగలనని పేరు తెచ్చుకున్నానంటే అదంతా ఆయన చలవే. ఓ సినిమాలో డైలాగు సరిగా చెప్పలేకపోతుంటే బూటు కాలితో తన్ని ?ఇదీ.. డైలాగ్ ఇలా చెప్పాలి? అని నేర్పించారు. నిజానికి కోపంతో ఆ రోజే వెనక్కి వెళ్లిపోదామనుకున్నా. కానీ దాసరి గారు ఆ రోజు నన్నలా తయారు చేయకపోయి ఉంటే ఇప్పుడు నేనిలా ఉండేవాణ్ని కాదు?? అని మోహన్ బాబు అన్నారు.

దాసరి మాట్లాడుతూ.. త్వరలోనే మోహన్ బాబుతో ఓ చరిత్ర సృష్టించే సినిమా తీయబోతున్నట్లు చెప్పారు. ??కొన్ని కారణాల వల్ల కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నా. త్వరలోనే మోహన్ బాబుతో ఓ చరిత్రాత్మక సినిమా తీయబోతున్నా. మోహన్ బాబు ప్రతి కదలికా నాకు తెలుసు. ఏ దర్శకుడైనా నటుణ్ని పరిచయం చేసి వదిలేస్తాడు. కానీ నేను మోహన్ బాబును పరిపూర్ణ నటుణ్ని చేసేదాకా వదల్లేదు. దేశంలో మోహన్ బాబు లాంటి కెరీర్ గ్రాఫ్ ఎవ్వరికీ లేదు. విలన్ గా పరిచయమై హీరోగా మారి.. మళ్లీ విలన్ పాత్రలు చేసి మళ్లీ హీరో అయిన నటుడు దేశంల మోహన్ బాబు ఒక్కడే?? అన్నారు.

,  ,  ,  ,  ,