Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Apr-2017 12:49:13
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు ఫిలిం నగర్లో చాలామంది సందేహం ఇదే. అసలు స్టయలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాను ఎందుకు చేయలేదు అనే ప్రశ్న వినిపిస్తోంది. మనోడు వదిలించుకున్నాడా? లేకపోతే అప్పజెప్పాడా? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఏ సినిమా గురించో మీకు అర్ధమైందా? అదేనండీ శ్రీను వైట్ల అండ్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న ''మిష్టర్'' గురించే.

నిజానికి శ్రీను వైట్ల తొలుత మిష్టర్ కథను అల్లు అర్జున్ కు నెరేట్ చేశాడు. ఆ తరువాత ఏమైందో ఏమో కాని.. వరుణ్ తేజ్ ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే వరుణ్ తేజ్ దీని గురించి చెబుతూ.. ఈ కథను విన్న తరువాత ఈ సినిమా నీకు బాగుంటుంది అంటూ బన్నీ సజెస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఏమో నిజమే కావొచ్చు.. ఎందుకంటే బన్నీ ఇమేజ్ కు కొన్ని కథలు సెట్టవ్వవు. పైగా ఊరమాస్ హీరో తరహాలో వరుసగా 50 కోట్లు 70 కోట్లు షేర్ ను పట్టేస్తున్న బన్నీ.. ఇప్పుడు సడన్ గా లవర్ బాయ్ లా సినిమా చేస్తే రిజల్టు తేడా పడే ఛాన్సుంటుంది. అందుకే వరుణ్ కు అప్పజెప్పాడని అంటున్నారు సన్నిహితులు.

కాకపోతే శ్రీను వైట్ల మాత్రం.. ఈ కథను ముందు ఒక పెద్ద స్టార్ కు చెప్పాను.. అతనికంటే బాగా వరుణ్ తేజ్ కు సూటవుతుంది అనిపించి ఇతడితో సినిమాను చేశాను అంటూ సెలవిస్తున్నాడు. ఇలా బన్నీ పేరును ప్రస్తావించట్లేదు అంటే.. బన్నీకి కథ నచ్చలేదా అనే సందేహం సాధారణంగా ఉత్పన్నమవుతుందిగా. అందుకే బన్నీ ఈ సినిమాను వదిలించుకున్నాడా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి

,  ,  ,  ,  ,