Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2016 10:38:03
facebook Twitter Googleplus
Photo

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ అనతి కాలంలో బోలెడంత గుర్తింపు సంపాదించుకున్నాడు. కొలవెరి పాటతో ఇతగాడి పేరు ప్రపంచమంతా మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లోకే పరిమితం అయిపోయిన ఈ కుర్రాడిని టాలీవుడ్ లోకి తెచ్చేందుకు బాగానే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటివరకూ ఇది జరగకపోయినా.. త్వరలో పవన్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రానున్న మూవీకి అనిరుధ్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీకి .. మొదట అనిరుధ్ నే అనుకున్నారు. ముందు ఒప్పుకుని ఆ తర్వాత తప్పుకున్నాడీ మ్యూజిక్ డైరెక్టర్. త్రివిక్రమ్ మూవీ అ..ఆ..కి ఇతగాడు కొన్నాళ్లు వర్క్ చేశాడు కూడా. అయితే.. పర్సనల్ రీజన్స్ తో ఆ ప్రాజెక్టు నుంచి కూడా వైదొలగాడు అనిరుధ్. అప్పట్లో అ..ఆ.. మూవీకి నిర్మాత రాధాకృష్ణ ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి అడ్వాన్స్ చెల్లించాడు. ఇంకా ఆ అమౌంట్ అతని దగ్గరే ఉంది. ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్-రాధాకృష్ణలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయనున్న మూవీకి సంగీతం అందించేందుకు సై అన్నాడట ఈ కంపోజర్.

పవన్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో.. పవర్ స్టార్ ప్రాజెక్టు ఈ కుర్ర సంగీత సంచలనాన్ని ఫైనల్ చేసేసినట్లు తెలుస్తోంది. అలా మెగా పవర్ స్టార్ తో మిస్ అయ్యి.. పవర్ స్టార్ తో ఎస్ అనిపించుకున్నాడు అనిరుధ్.

,  ,  ,  ,  ,  ,