Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2017 16:19:40
facebook Twitter Googleplus
Photo

ఫంక్షన్ లో చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ కామెంట్ చేసినప్పటి నుంచి.. బన్నీని కొందరు పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేసిన మాట వాస్తవమే. అందుకే దువ్వాడ జగన్నాధంకి సంబంధించి యూట్యూబ్ లో ఏది పోస్ట్ అయినా.. డిజ్ లైకులు కొట్టారు.

ఇప్పుడు డీజే రిలీజ్ డేట్ దగ్గరకొచ్చేస్తోంది. ఇలాంటి సమయంలో అయినా ఆ పాత వివాదానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. పవన్ వీరాభిమానిని అని చెప్పే దర్శకుడు హరీష్ శంకర్.. డీజే ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ పేరు జపించాడు. మెగా ఫ్యాన్స్ మధ్యన ఏదైనా తేడాలు ఉంటే తుడిచేద్దామనే ప్రయత్నమే ఇది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. పవన్ గురించి హరీష్ శంకర్ చెబుతుంటే.. బన్నీ చప్పట్లు కొడుతూ కనిపించిన విషయాన్ని కూడా మర్చిపోకూడదు. డైరెక్టుగా డిజ్ లైక్ వార్ గురించి మాట్లాడకపోయినా.. దువ్వాడ జగన్నాధం ఆడియో ఫంక్షన్ లో చెప్పను బ్రదర్ వివాదానికి శుభం కార్డ్ వేసే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పచ్చు.

అలాగే అల్లు అర్జున్ స్పీచ్ సమయంలో కూడా పవర్ స్టార్ అని ఒకటికి నాలుగు సార్లు చెప్పడం కూడా గమనించాలి. మరి బన్నీ నుంచి మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే అని.. ఏ హీరోకి వేర్వేరుగా ఫ్యాన్స్ లేరని చెప్పడం వెనక.. మేమంతా ఒకటే.. మీరు కూడా అలాగే ఉండమని.. ఇన్ డైరెక్టుగా చెప్పాడని భావించచ్చు.

,  ,  ,  ,  ,