Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2016 14:05:05
facebook Twitter Googleplus
Photo

సరైనోడుతో సరైన సక్సెస్ సాధించి మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి ఎక్కువ సమయాన్నే తీసుకున్నాడు. ఏప్రిల్ చివరి వారంలో సరైనోడు రిలీజ్ కాగా.. ఇప్పటికి కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే బన్నీ కొత్త సినిమా డీజే-దువ్వాడ జగన్నాధం షూటింగ్ ప్రారంభమైంది. అయితే.. బన్నీ మాత్రం ఇంకా యూనిట్ తో జతకాలేదు.

మిగిలిన తారాగణంతో కొన్ని సీన్లను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇప్పుడు బన్నీ కూడా దువ్వాడ జగన్నాధం షూటింగ్ వచ్చేస్తున్నాడు. దీనికి నవంబర్ 4న.. అంటే రేపే ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అల్లు అర్జున్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి మూవీ కావడంతో ఈ చిత్రంపై ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఉంది. మరోవైపు మొహెంజొదారో హీరోయిన్ పూజా హెగ్డేను ఫిమేల్ లీడ్ గా తీసుకోవడం కూడా ప్రాజెక్టుకు మరింత వాల్యూ పెంచింది. అయితే.. డీజే ను ప్రారంభించడానికి టైమ్ తీసుకున్నా.. షూటింగ్ మాత్రం చాలా వేగంగా పూర్తి చేసేయనున్నాడట బన్నీ.

మార్చ్ చివరికే ఫస్ట్ కాపీ చేతిలో ఉండేలా ప్లానింగ్ చేశారని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో సమ్మర్ హాలిడేస్ ప్రారంభంలోనే వచ్చి బ్లాక్ బస్టర్ సాధించినట్లుగానే.. వచ్చే ఏడాది కూడా ఏప్రిల్ లోనే తన చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది బన్నీ ఆలోచనగా చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా డీజే-దువ్వాడ జగన్నాధం షూటింగ్ శరవేగంగా సాగనుంది.

,  ,  ,  ,  ,  ,