Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2017 12:24:16
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్ టీం సినిమాను విడుదలకు రెడీ చేసే పనుల్లో తలమునకలై ఉండగా.. వారికి లేని పోని తలనొప్పులు మొదలవుతున్నాయి. ఓవైపు ఎప్పుడో తొమ్మిదేళ్ల కిందట సత్యరాజ్ కర్ణాటకకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల్ని తెరమీదికి తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో ఈ సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక బాహుబలి టీం తలలు పట్టుకుంటూ ఉంటే.. తమిళనాట కొత్త వివాదం తలెత్తింది. ఫైనాన్స్ వ్యవహారాలకు సంబంధించిన వివాదంతో ఏసీఈ మీడియా అనే సంస్థ ‘బాహుబలి-2’ ఈ నెల 28 విడుదల కాకుండా స్టే విధించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది.

ఐతే కోర్టు ఈ సినిమా విడుదలను ఆపడానికి అంగీకరించలేదు. ఈ కేసును విచారణకు స్వీకరించింది కానీ.. స్టే విధించడానికి నిరాకరించింది. సినిమా యధావిధిగా విడుదలవుతుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. బాహుబలి ఎగ్జిబిషన్ రైట్స్ తీసుకున్న శరవణన్ అనే వ్యక్తి తమ దగ్గర్నుంచి గత ఏడాది జనవరిలో రూ.కోటికి పైగా రుణం తీసుకున్నాడని.. తమకు అతడి నుంచి రూ.1.18 కోట్లు రావాల్సి ఉందని.. ఆ డబ్బులు ఒప్పందం ప్రకారం తిరిగి చెల్లించలేదని అంటూ ఏసీఈ మీడియా కోర్టుకెక్కింది. పెద్ద సినిమాల విడుదలకు ముందు ఇలాంటి వివాదాలు తలెత్తడం.. నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురి కావడం తమిళనాట మామూలే.

,  ,  ,  ,  ,  ,  ,