తాజాగా 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో ప్రేక్షకులను మరోసారి రంజింపజేసిన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సమ్మర్ వెకేషన్ తీసుకుంటున్నాడు. కుటుంబంతో కలసి వేసవి విడిది కోసం లండన్ వెళుతున్నాడు. అక్కడ కొన్నాళ్ల పాటు హాయిగా రిలాక్సయి నూతనోత్సాహంతో తిరిగివచ్చాక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగులో పాల్గొంటాడు. కాగా, ప్రతి సినిమాకి ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించే బన్నీ ఈ సినిమా కోసం కూడా కొత్త గెటప్ ట్రై చేస్తున్నాడు. అంతేకాదు, కండలు కూడా పెంచుతున్నాడు. అలాగే, కొత్త హెయిర్ స్టయిల్ ను కూడా ప్రయత్నిస్తున్నాడు. మొత్తానికి, బోయపాటి తన హీరోలను యాక్షన్ పరంగా కొత్త కోణంలో చూపిస్తాడు కాబట్టి, ఇందులో కొత్త బన్నీ కనిపించడం ఖాయమే!
alluarjun, boyapati, geetaarts, tollywood, news, ameeradasturi, london,