Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2017 14:00:38
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నెన్నో సేవలు అందించిన సినారె వెళ్లిపోయారు. ఆయన పాట ఇక వినిపించదనే ఆలోచనే చాలా మందిని కలవరపెడుతోంది. ఇంతటి విషాదంలోను ఆయన అభిమానులకు ఒక ఊరట లభించనుంది. అదే.. సినారె వెళ్లిపోయినా.. ఆయన అందించిన మరో పాట వినే అవకాశం తెలుగు సినీ ప్రేక్షకులకు దక్కనుంది.

నెల వంక తొంగి చూసింది అనే పాట మాకు అందించి నెల తిరక్క ముందే తెర మరుగైన నిండు పౌర్ణమి సి నారె గారికి మా అశ్రు నివాళి అంటూ సి నారాయణ రెడ్డికి ఎంతో ఘనంగా నివాళి ఘటించింది నేనే రాజు నేనే మంత్రి మూవీ యూనిట్. ఈ మూవీకోసం సినారె అందించిన పాట బహుశా.. ఆయన పెన్ను నుంచి జాలువారిన అక్షరాల్లో ఆఖరిది కావచ్చు. త్వరలో విడుదల కానున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో ఆయన అందించిన మధురమైన మరో గేయం ప్రేక్షకులకు వినిపించనుంది.

ఎంతో అద్భుతమైన ఓ ప్రయాణం ముగిసింది. నేనే రాజు నేనే మంత్రి చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది అంటూ మూవీ షూటింగ్ ఆఖరి దశకు చేరుకున్నట్లు కాజల్ తెలిపింది.

,  ,  ,  ,  ,