Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2017 13:17:41
facebook Twitter Googleplus
Photo

దువ్వాడ జగన్నాధం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. అల్లు అర్జున్ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై చాలానే అంచనాలు ఉండగా.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. చాలా సింపుల్ లుక్ తో బన్నీ కనిపిస్తుండగా.. అన్నపూర్ణ కేటరింగ్స్ కి పని చేసే ఈ విజయవాడ పంతులు లుక్ లో చాలానే విశేషాలు ఉండడం విశేషం.

ఈ ఫస్ట్ లుక్ లో బన్నీ గెటప్ మెయిన్ అట్రాక్షన్ అనే విషయం తెలిసిందే అయినా.. కేవలం బన్నీ స్టైలింగ్ తో చాలానే విషయాలు చెప్పేందుకు ప్రయత్నించామని స్టైలిస్ట్ సుపర్ణ చెబుతోంది. 'డీజేలో బన్నీ ఓ రియలిస్టిక్ పాత్ర చేస్తున్నాడు. ఓ పెద్ద మిషన్ ను హ్యాండిల్ చేసే ఓ అమాయకుడైన యువకుడి రోల్. అందుకే ఈ పాత్రకు స్టైలింగ్ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నాం' అని చెబుతోంది ఈ స్టైలిష్ట్. 'సాంప్రదాయ ధోవతీలకు గోల్డ్ బోర్డర్ ఉంటుంది. మేం సిల్వర్ కలర్ ఉపయోగించాం. భవిష్యత్ గురించి ఎంతో ఆలోచించే కేరక్టర్ కు అనుగుణంగానే ఈ కలర్ ఉంటుంది. అలాగే కాషాయ కండువాకి కూడా ఓ లెక్క ఉంటుంది. సింపుల్ గానే ఉన్నా.. బన్నీ లుక్ ఈ మూవీకి ప్రత్యేకం' అంటోందీమె.

మరి దువ్వాడ జగన్నాధం కేరక్టర్ గురించి అడిగితే మాత్రం.. దర్శకుడు హరీష్ శంకర్ గుట్టు దాటేస్తున్నాడు. 'త్వరలో టీజర్ విడుదల చేయనున్నాం

,  ,  ,  ,  ,  ,