Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Dec-2017 09:58:21
facebook Twitter Googleplus
Photo

హీరోల మార్కెట్ రేంజ్ సినిమా సినిమాకు బాగానే పెరుగుతోంది. దీంతో రెమ్యునరేషన్ కూడా బాగానే పెంచేస్తున్నారు. అయితే డబ్బును ఉపయోగం లేకుండా దాచుకుంటే ఏం వస్తుందని నాలుగు రూపాయలు ఖర్చుపెట్టి లాభాన్ని పొందాలని అనుకుంటున్నారో తెలియదు గాని నిర్మాతలుగా మారిపోతున్నారు. హిట్టు సినిమాలు తీసిన అనుభవం ఉంది. మంచి కథ ఎదో తెలుసుకునే ఆలోచన ఉంది కాబట్టి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చి మంచి కథలను సొంతంగా ప్రొడ్యూస్ చేయాలనీ అనుకుంటున్నారు.

ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖైదీ నెంబర్ 150 సినిమాను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. ఇక నాని కూడా ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశాడు. అ! సినిమా ప్రస్తుతం తెరకెక్కుతోంది. అయితే బన్నీ కూడా తన సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయాలనీ అనుకునుటున్నాడట. అల్లు వారి చెంత ఆల్రెడీ గీతా ఆర్ట్స్ అనే బడా నిర్మాణ సంస్థ ఉంది. ఆ ప్రొడక్షన్ లో బన్నీ సినిమాలను కూడా చేశాడు. కానీ ఇప్పుడు తనకంటూ హీరోగా ఒక గుర్తింపు వచ్చింది కాబట్టి తన ఇష్ఠానుసారం కొన్ని నచ్చిన కథలను తెర వరకు తీసుకురావాలని తపన పడుతున్నాడట.

కార్తికేయ సినిమాకు కో డైరెక్టర్ గా వర్క్ చేసిన అను కె రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు.

,  ,  ,  ,  ,