Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2016 11:42:18
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వయసు ఇప్పుడు 56 ఏళ్లు. మరి ఏజ్ లో తన వయసు హీరోలతో పోటీ పడ్డం అంటే.. అదేమంత పెద్ద విషయం కాదు. కానీ నాగ్ మాత్రం కుర్ర హీరోలతో పోటీ వచ్చేస్తుంటాడు. అదే అసలు పెద్ద సమస్య. ఇప్పుడీ పోటీ ఏ రేంజ్ కి చేరిపోయిందంటే.. తన కుమారులను కూడా డామినేట్ చేసేసి ముందుకొచ్చేశాడు నాగ్.

హైద్రాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2015 జాబితాని రీసెంట్ గా ప్రకటించారు. ఇందులో నాగార్జునకు దక్కిన స్థానం ఎంతో తెలుసా? పదవ స్థానంలో నిలిచారు నాగ్. మన్మథుడికి పదో స్థానం అంటే ఆశ్చర్యం లేదు కానీ.. ఆయన కొడుకులిద్దరూ రేస్ లో వెనకబడిపోవడం ఆశ్చర్యకరం. అక్కినేని నాగచైతన్య 19 వ స్థానంలో ఉండగా.. అఖిల్ 22వ ప్లేస్ తో సరిపెట్టేసుకోవాల్సి వచ్చింది. అంటే కుమారుల కంటే నాగ్ నే ఎక్కువమంది కావాలంటున్నారు.

గతేడాది ఇదే లిస్ట్ లో అఖిల్ 6 - చైతు 11 - నాగార్జున 12వ స్థానాల్లో ఉన్నారు. కానీ సోగ్గాడే చిన్ని నాయన - ఊపిరి సినిమాల తర్వాత నాగ్ కు క్రేజ్ అమాంతం పెరిగిపోగా.. చైతు మాత్రం తన స్థాయిని కంటిన్యూ చేస్తున్నాడు. కానీ.. అఖిల్ మాత్రం.. ఆరో స్థానం నుంచి 22కి పడిపోయాడు. దీనికి కారణం మొదటి సినిమా అఖిల్ నిరుత్సాహపరచడమే అని చెప్పాలి. ఏమైనా ఈ ఏజ్ లో కూడా తన కొడుకులతో పాటు అనేక మంది కుర్ర హీరోల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించడం మాత్రం నాగ్ కే చెల్లింది.

,  ,  ,  ,  ,  ,