Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Oct-2016 11:55:06
facebook Twitter Googleplus
Photo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు వరుస హిట్స్ రేసుగుర్రం ల పరుగు పడుతున్నాడు..ఇటీవల హరీష్ శంకర్ తో డిజె మొదలు పెట్టిన సంగతి తెల్సిందే..మరోపక్క తమిళనాట కూడా అడుగువెయ్యబోతున్నాడు. టాప్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం లో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కబోతున్న ఓ సినిమా కు కమిట్ అయ్యాడు.

అయితే ఈ చిత్రానికి తాను తీసుకొనబోతున్న రెమ్యునరేషన్ ఫై ఇప్పుడు ఫిలిం సర్కిల్ ఆసక్తి నెలకొంది..మాములుగా అల్లు అర్జున్ 10- 12 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటాడు..అయితే ఈ చిత్రానికి మాత్రం నైజాం ఏరియా హక్కులను కావాలని అడుగుతున్నాడట..ఏ సినిమాకయినా నైజాం ఏరియా లో భారీ కలెక్షన్స్ వస్తాయని అందరికి తెలుసు. అందుకే ఏ నిర్మాత కూడా నైజాం ను వదులుకోవడానికి సిద్దపడరు. ఇప్పుడు బన్నీ ఆ రైట్స్ అడగడం తో నిర్మాత జ్ఞానవేల్ ఆలోచనలో పడ్డాడట. చూడాలి మరి అల్లు అర్జున్ చేతికి ఆ రైట్స్ వస్తాయో రావో

,  ,  ,  ,  ,