Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2017 11:34:24
facebook Twitter Googleplus
Photo

ఎక్కడో ఎప్పుడో సరదాగా మొదలైంది ఐస్ బకెట్ ఛాలెంజ్. ఆ తర్వాత దీన్ని ఓ మంచి పని కోసం వాడాలంటూ రైస్ బకెట్ ఛాలెంజ్ మొదలైంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు హ్యాండ్ లూమ్ ఛాలెంజ్ స్టార్ట్ చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఇలా ఏదో ఒక మంచి పని ప్రారంభించడం.. పలువురు సెలబ్రిటీలను నామినేట్ చేయడం వంటివి.. ప్రధాని మోడీ కూడా చేశారు. ఇప్పుడు మంచు మనోజ్ ఇలాంటిదే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు.

మనోజ్ కుమార్స్ యూనిటీ' పేరుతో మంచు మనోజ్ ఇప్పుడు రైతుల కోసం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. భారత దేశానికి వెన్నెముక లాంటి రైతులను ఆదుకునేందుకు ఉద్దేశించినదే ఈ కార్యక్రమం. తన ఆదాయంలోంచి 10 శాతం రైతులకు అందిస్తానని మనోజ్ శపథం చేశాడు. రైతులను ఆదుకుందాం అంటూ ఈ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన మనోజ్.. ఇందుకోసం పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానం పలికాడు. వారి వార్షిక వేతనంలో ఎంతో కొంత అందించాల్సిందిగా పిలుపునిచ్చాడు.

తాను ప్రారంభించిన ఈ కార్యక్రమం కోసం ఐదుగురిని నామినేట్ చేశాడు మనోజ్. మంత్రి కేటీఆర్.. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. హీరోలు దగ్గుబాటి రానా.. సాయి ధరం తేజ్ లతో పాటు పారిశ్రామికవేత్త జీవీ కేశవ్ లను నామినేట్ చేశాడు మనోజ్. రైతులు ఎలాంటి డొనేషన్స్ తీసుకోరని నాకు తెలుసు.

,  ,  ,  ,