Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2016 14:16:10
facebook Twitter Googleplus
Photo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడుతో ఇండస్ట్రీ హిట్ కొట్టేశాక.. బాగానే గ్యాప్ తీసుకున్నాడు. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫైనల్ చేయడానికే నాలుగు నెలలు పట్టగా.. ఎట్టకేలకు హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'డీజే - దువ్వాడ జగన్నాధం' చేస్తున్నట్లు అఫీషియల్ గానే అనౌన్స్ చేసేశారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ కు చేరుకోగా.. ఇప్పుడు డీజేకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది.

హరీష్ శంకర్ మరోసారి ఫుల్ ప్లెడ్జెడ్ గా కామెడీని.. పంచ్ డైలాగ్స్ నే నమ్మకున్నాడని తెలుస్తోంది. పైగా ఈ మూవీలో బన్నీ ఓ బ్రాహ్మిన్ పాత్ర పోషిస్తున్నాడట. అదుర్స్ లో ఎన్టీఆర్ చేసిన 'చారి' పాత్రకు దగ్గరగా ఈ రోల్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు దువ్వాడ జగన్నాధంగా అల్లు అర్జున్ మరోసారి సిక్స్ ప్యాక్ ను చూపించబోతున్నట్లు చెబుుతున్నారు. డీజేకి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ హైద్రాబాద్ లోనే చేయనున్నారట.

ఈ ప్రాజెక్ట్ పై బన్నీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. హరీష్ శంకర్ చెప్పిన లైన్ కి ఫ్లాట్ అయిపోవడంతో లింగుస్వామితో అనుకున్న మూవీని కూడా.. హోల్డ్ లో పెట్టేశాడు. రామయ్యా వస్తావయ్యాతో బ్యాడ్ టైమ్ ఎదుర్కున్న ఈ డైరెక్టర్.. సుబ్రమణ్యం ఫర్ సేల్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు కానీ.. తన స్థాయికి తగిన సినిమా తీయలేదు. ఇప్పుడు బన్నీతో హిట్ కొట్టేసి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సరసన చేరిపోయేందుకు.. హరీష్ శంకర్ గట్టిగానే ట్రై చేస్తున్నట్లు టాక్.

,  ,  ,  ,  ,  ,