Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2017 11:18:42
facebook Twitter Googleplus
Photo

చకచకా సినిమాలు చేసుకుంటూ పోవడం స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టయిల్. ఒక సినిమా షూటింగ్ అయ్యేలోగానే నెక్ట్స్ మూవీకి షూటింగ్ కోసం రెడీ అయిపోతాడు. దువ్వాడ జగన్నాథమ్ సినిమా షూటింగ్ లో ఉండగానే నా పేరు సూర్య సినిమా ఓకే చేశాడు. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే తర్వాత మూవీ ఫైనలైజ్ చేయడంపై బన్నీ దృష్టి పెట్టాడు.

అల్లు అర్జున్ చకచకా సినిమాలు చేసుకుంటూ పోయినా కొత్త డైరెక్టర్లకు ఛాన్సులివ్వడం అనేది చాలా రేర్. తన 20 సినిమాల కెరీర్ లో రెండుసార్లే కొత్త డైరెక్టర్లతో సినిమా చేశాడు. మొదటిసారి కెరీర్ బిగినింగ్ లో ఆర్య సినిమా సుకుమార్ తో చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు వక్కంతం వంశీకి డైరెక్టర్ గా అవకాశమిచ్చాడు. కానీ బన్నీ తన తర్వాత సినిమా కూడా కొత్త డైరెక్టర్ తో చేసే ఆలోచనలో ఉన్నాడట. నాపేరు సూర్య తర్వాత బన్నీ ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. డైరెక్టర్ కథ చెప్పిన విధానానికి బాగా ఇంప్రెస్ అవడంతో అతడికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.

నాపేరు సూర్య సినిమాతో రైటర్ వక్కంతం వంశీ తొలిసారి డైరెక్షన్ అవకాశం దక్కించుకున్నాడు. ఇంతకుముందు కిక్ - టెంపర్ వంటి సూపర్ హిట్ సినిమాలకు కథ అందించింది వక్కంతం వంశీయే. డైరెక్టర్ కావాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్న అతడికి ఎట్టకేలకు బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పందెంకోడి ఫేం డైరెక్టర్ లింగుసామి - జైలవకుశ డైరెక్టర్ బాబీ కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

,  ,  ,  ,  ,