Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2017 10:25:59
facebook Twitter Googleplus
Photo

చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారనే అంచనాలు ఏర్పడగానే.. ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ పేరే మొదట చర్చకు వచ్చింది. అయితే.. రామ్ చరణ్ స్వయంగా తానే ఈ సినిమా నిర్మిస్తున్నట్లు చెప్పడంతో మెగా 150 మూవీ.. ఖైదీ నంబర్ 150 మూవీ నిర్మాణ బాధ్యతలు చెర్రీ చేతికి వెళ్లాయి.

ఆ తర్వాత మెగా 151ను కూడా తానే నిర్మిస్తానని చెప్పాడు రామ్ చరణ్. అయితే.. చిరుతో ఎన్నో సక్సెస్ లు అందించిన హిస్టరీ ఉన్న గీతా ఆర్ట్స్ బ్యానర్ పై.. ఓ మూవీకి అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకు కథ సిద్ధం చేసుకోవడంలో బిజీగా ఉన్నారాయన. ఇందుకోసం దర్శకుడు బోయపాటి శ్రీనుపై ఒత్తిడి తెస్తున్నారు కూడా. గతేడాది అల్లు అర్జున్ కు సరైనోడు రూపంలో భారీ సక్సెస్ ఇచ్చిన బోయపాటిపై అల్లు అరవింద్ కు మంచి గురి కుదిరింది. అందుకే.. చిరుతో సినిమాను బోయపాటితో చేస్తానని ఇప్పటికే చెప్పేశారు కూడా. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పారు అల్లు.

ఎంత త్వరగా సబ్జెక్ట్ తీసుకువస్తే.. అంత త్వరగా మెగాస్టార్ తో మూవీ స్టార్ట్ చేస్తానని అన్నారు. అయితే.. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ రీలాంఛింగ్ మూవీతో భారీ సక్సెస్ కొట్టేందుకు కష్టపడుతున్న బోయపాటి శ్రీను.. ఇప్పుడు కొన్ని స్టోరీ లైన్స్ అనుకుంటున్నా.. చేతిలో ఉన్న సినిమా పూర్తయ్యాక.. చిరు కథపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని అనుకుంటున్నాడు.

,  ,  ,  ,  ,