Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2016 12:12:43
facebook Twitter Googleplus
Photo

బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి మార్కెట్ వ్యూహాలకి అనుగుణంగానే తెరకెక్కుతోంది. దర్శకుడు క్రిష్ కూడా సినిమా నిర్మాణంలో ఓ భాగస్వామి కావడంతో ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకుని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సహజంగానే బాలకృష్ణ సినిమాలకి కన్నడలో మంచి మార్కెట్టుంటుంది. అయితే ఆ మార్కెట్టుని మరింత ఆకర్షించేలా... కన్నడ నుంచి మరిన్ని వసూళ్లు దక్కేలా.... క్రిష్ ఓ కీలక నిర్ణయం తీసుకొన్నాడు. కన్నడ స్టార్ శివరాజ్కుమార్ని సినిమాలో భాగం చేశారు. బాలకృష్ణకీ - శివరాజ్ కుమార్ కీ మంచి అనుబంధం ఉంది.

ఆ అనుబంధంతోనే బాలకృష్ణ వందో సినిమాలో నటించడానికి శివరాజ్ కుమార్ ఆసక్తి చూపాడట. అది క్రిష్ కి కలిసొచ్చింది. అందుకే వెంటనే ఓ అతిథి పాత్రని సృష్టించాడట. త్వరలోనే శివరాజ్ కుమార్ పై సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. శివరాజ్ కుమార్ నటించే సన్నివేశాలు - రెండు పాటల్ని తెరకెక్కిస్తే ఇక సినిమా పూర్తయినట్టే అట. అయితే తాజాగా శివరాజ్ కుమార్ పాత్ర గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. సినిమాలో బాలకృష్ణకి మనవడిగా శివరాజ్ కుమార్ కనిపిస్తాడట. శివరాజ్ కుమార్ పాత్రతోనే సినిమా ఆరంభమవుతుందని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనే తాత అయిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ తెరపై కనిపించబోతోందని ఫిల్మ్ నగర్ లో ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంతవరకు నిజమన్నది తేలాల్సి వుంది. జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. శివరాజ్ కుమార్ నటిస్తుండడంతో గౌతమి పుత్ర శాతకర్ణిపై కన్నడలో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.

,