Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2017 12:04:54
facebook Twitter Googleplus
Photo

అల్లు శిరీష్ తొలి సినిమా గౌరవం రిలీజైనపుడు దానికి ఉద్దేశపూర్వకంగా పబ్లిసిటీ బాగా తగ్గించడం.. దాని గురించి మీడియాలో పెద్దగా చర్చ జరగకుండా చూడటం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ఫ్లాప్ అని.. అల్లు శిరీష్ పెర్ఫామెన్స్ పూర్ అని ముందే తేలిపోవడంతో అల్లు అరవింద్ ఉద్దేశపూర్వకంగానే దీనికి పబ్లిసిటీ లేకుండా చేశాడని అంటారు. మామూలుగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు సోషల్ మీడియాతో హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఇందుకోసం ఒక పీఆర్వో టీం ఎప్పుడూ సోషల్ మీడియాలోనే తిష్టవేసి పబ్లిసిటీ మోతెక్కించే పనిలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ టీం జోరు బాగా పెంచేసింది. మెగా ఫ్యామిలీ హీరోల కొత్త సినిమా రిలీజైందంటే చాలు.. గట్టిగా గాలి కొడుతూ ఉంటుంది ఈ టీం.

ఐతే ఈ పీఆర్వో టీం అల్లు శిరీష్ మలయాళంలో అరంగేట్రం చేస్తూ చేసిన సినిమా 1971 బియాండ్ బోర్డర్స్ గురించి పెద్దగా ప్రచారం ఏమీ చేయట్లేదు. రిలీజ్ టైంలో కేరళలో నెలకొన్న హడావుడి గురించి ట్వీట్లు.. రీట్వీట్లు కనిపించాయి తప్ప సినిమా రిజల్ట్ ఏంటన్నదాని గురించి పెద్దగా పబ్లిసిటీ ఏమీ లేదు. నిజానికి ఈ చిత్రానికి మలయాళంలో యావరేజ్ రివ్యూలొచ్చాయి. సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. అందరూ మోహన్ లాల్ను యధావిధిగా పొగిడారు. ఆయన పెర్ఫామెన్స్ అద్భుతం అన్నారు. అల్లు శిరీష్ గురించి పెద్దగా పొగిడిందేమీ లేదు. అన్ని రివ్యూల్లోనూ అతడి గురించి ఒక లైన్ కు మించి ప్రస్తావించలేదు. ఒకవేళ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. అల్లు శిరీష్ పెర్ఫామెన్స్ ఆహా ఓహో అని ఉంటే.. ఈ పాటికి ఇక్కడ పబ్లిసిటీ ఓ రేంజిలో ఉండేది. దీన్ని బట్టి సినిమా గురించి.. అల్లు శిరీష్ పెర్ఫామెన్స్ గురించి ఒక అంచనాకు రావచ్చు. ఈ చిత్రాన్ని 1971 భారత సరిహద్దు పేరుతో తెలుగులోకి అనువాదం కూడా చేశారు. ఒకేసారి రిలీజ్ చేయాలని కూడా అనుకున్నారు. కానీ ఎందుకో రిలీజ్ ఆగిపోయింది.

,  ,  ,  ,