Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2017 13:17:45
facebook Twitter Googleplus
Photo

స్థాయిల సంగతి పక్కన పెడితే.. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వారికి ఉండే ఇమేజ్ వేరు. టాలీవుడ్ హీరోగా.. తర్వాతి రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. టీవీ షాల్లో ప్రయోక్తగా .. ఈ మధ్యనే బిగ్ బాస్ షోలో ఫైనల్ వరకూ వచ్చిన నటుడు నవదీప్.

సూటిగా మాట్లాడుతూ.. మధ్య మథ్యలో ఫన్నీ పంచ్ లు ఇచ్చే ఈ నటుడు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న నవదీప్.. సరదా మాటల్లో సీరియస్ వ్యాఖ్య ఒకటి చేశారు. సాధారణంగా పొలిటికల్ అంశాల మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం.. లేదంటే.. మనకెందుకులే అన్నట్లుగా తప్పుకోవటం కనిపిస్తుంది.

దీనికి భిన్నంగా నవదీప్ మాత్రం సీరియస్ గా తన మనసులోని మాటను సూటిగా చెప్పేశారు. ర్యాపిడ్ క్వశ్చన్లలో భాగంగా సీరియస్ గా సీఎం అయ్యే అర్హత ఎవరికి ఉందన్న ప్రశ్నకు మరో ఆలోచనకు తావు లేకుండా.. క్షణాల్లోనే పవన్ కల్యాణ్ అని చెప్పేశారు నవదీప్.

,  ,  ,  ,  ,