Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 14:59:40
facebook Twitter Googleplus
Photo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ సరైనోడు.. రివ్యూలు - టాక్ కు అతీతంగా.. సూపర్ స్ట్రాంగ్ గా నిలిచాయి కలెక్షన్స్. తొలి మూడు రోజుల్లో ఏపీ తెలంగాణల్లోనే 21.72 కోట్లు వసూలయ్యాయంటే.. బాక్సాఫీస్ దగ్గర సరైనోడు ఎలా కుమ్మేస్తున్నాడో అర్దమవుతుంది. ఈ మూవీపై అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ బోలెడు ఎక్సైట్ మెంట్ కు గురవతున్నాడు. రీసెంట్ గా సరైనోడు చిత్రాన్ని చూసిన అల్లు శిరీష్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని చెప్పడంతో పాటు.. తమ తరానికి అల్లు అర్జున్ ని ఓ మైలురాయిలా తీసుకోవాలంటున్నాడు. 'ఎట్టకేలకు సరైనోడు చూశాను. బన్నీ చింపి పక్కన పెట్టాడు. ఫైట్స్ సాంగ్స్ చూసి పిచ్చెక్కిపోయింది. బన్నీ - బ్రహ్మీ - విద్యు కామెడీ సూపర్. ఆది పినిశెట్టి ఇరగదీసేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ ని డిఫరెంట్ రోల్ లో చూడ్డం బాగుంది. బోయపాటి - తమన్ లతో పాటు సరైనోడు సక్సెస్ కు అభినందనలు' అంటూ ట్వీట్ చేశాడు అల్లు శిరీష్.

ఈ కుర్ర హీరో ఇక్కడితో ఆగిపోలేదు.. 'మా తరానికి బన్నీ ఓ స్కేల్ లాంటి వాడు. మా స్థాయిని మేం తెలుసుకోవాలంటే బన్నీతో పోల్చికోవాల్సిందే. యాక్టింగ్ - డ్యాన్స్ - ఫిట్ నెస్ - స్టైల్ - ఫైట్స్.. ఇలా అన్నిటిలోనూ బెంచ్ మార్క్ సెట్ చేశాడు' అంటూ అన్నయ్యపై బోలెడంత ప్రేమ - అభిమానం కురిపించేశాడు. తమ్ముడు పొగిడాడని కాదు కానీ.. నిజంగానే బన్నీ సెట్ చేసిన కొన్ని బెంచ్ మార్క్ లను అందుకోవడం చాలామందికి కష్టంగానే ఉంది.

,  ,  ,  ,  ,  ,  ,