Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2016 11:39:03
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మురుగదాస్ మూవీని పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ బైలింగ్యువల్ పై అంచనాలు చాలానే ఉండగా.. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. గత నెలలో చెన్నైలో కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ అండ్ మురుగ టీం.. నవంబర్ నెలలో మరింత స్పీడ్ పెంచేస్తున్నారు.

యాక్షన్ ఎంటర్టెయినర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి.. కొత్త షెడ్యూల్ హైద్రాబాద్ లో మొదలుపెట్టేశారు. నవంబర్ 1 నుంచి స్టార్ట్ చేసి.. నవంబర్ 14 వరకూ మొత్తం ఇక్కడ షూటింగ్ కి సంబంధించిన ఎపిసోడ్ ను పూర్తి చేసేయనున్నారట. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని.. నవంబర్ 22నాటికి అహ్మదాబాద్ వెళ్లనున్నాడు మహేష్ బాబు. అక్కడ కూడా రెండు వారాల షూటింగ్ చేయనున్నారట. డిసెంబర్ చివరినాటికి మొత్తం షూటింగ్ ను పూర్తి చేసేయాలన్నది మహేష్ బాబు ఆలోచనగా చెబుతున్నారు.

ఆ తర్వాత కేవలం కొన్ని పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నా.. రిలీజ్ డేట్ ను మే నెలాఖరుకు ప్లాన్ చేసుకోవడంతో.. క్వాలిటీ పరంగా రాజీ పడకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయచ్చని భావిస్తున్నాడట మహేష్. రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా ఈ మూవీతో మహేష్ బాబు తో జత కడుతోంది.

,  ,  ,  ,  ,