Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Aug-2015 12:01:43
facebook Twitter Googleplus
Photo

అల్లువారబ్బాయి శిరీష్ కి మహేష్ బాబు లేటెస్ట్ బంపర్ హిట్ శ్రీమంతుడు సూపర్ గా నచ్చేసిందట. ఈ విషయాన్నే తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ చెప్పాడు. ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి మహేష్ కి తీయడానికి కొరటాలకు చాలా గట్స్ ఉండాలని అభిప్రాయపడ్డాడు అల్లు శిరీష్.

సినిమా ఆద్యంతం అండర్ ప్లే చేస్తూ.. కామెడీ లవ్ యాక్షన్ సీన్ల ను మెప్పించి మహేష్ విపరీతంగా ఆకట్టుకున్నాడట. అలాగే కాస్టింగ్ లో సూపర్ స్టార్ ఉన్నా.. మాస్ మసాలాకు పరిమితం కాకుండా... సమాజానికి ఉపయోగపడే సినిమా తీసిన కొరటాలను పొగడ్తలతో ముంచెత్తాడు శిరీష్. సినిమాలో ఎవరూ నటించలేదని ప్రతీ ఒక్కరూ సహజంగా ప్రవర్తించేలా డైరెక్టర్ చాలా జాగ్రత్తపడ్డాడని అంటున్నారు అల్లువారబ్బాయి. ఇలాంటి మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు.. ఆడియన్స్ ను ప్రత్యేకంగా పొగిడాడు అల్లు శిరీష్.

నిజానికి సెలబ్రిటీలందరికీ శ్రీమంతుడు సినిమా తెగ నచ్చేసింది. చాలామంది హీరోలు అరే ఇలాంటి సినిమా మనం కూడా ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారట. కాకపోతే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఈ సినిమా చేసింది ఒక సూపర్ స్టార్ కాబట్టే సినిమా రేంజ్ అలా పెరిగింది. అదే సచిన్ జోషి వంటి ఒక హీరోను తెచ్చి శ్రీమంతుడు సినిమా తీస్తే రీచబిలిటీ బిలీవబిలిటి అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాదంటారా?

,  ,  ,  ,  ,