Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jul-2017 17:00:46
facebook Twitter Googleplus
Photo

టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ పై కాసుల వర్షం కురవాల్సిందే. అందులోనూ రంజాన్ పండక్కి భాయ్ వచ్చాడంటే ఇక కలెక్షన్ల మోత మామూలుగా ఉండదంతే. చాలా ఏళ్ల నుంచి నడుస్తున్న ఆనవాయితీ ఇది. డివైడ్ టాక్ తెచ్చుకున్న బాడీగార్డ్.. కిక్ లాంటి సినిమాలు కూడా భారీ వసూళ్లు సాధించాయి. అందులోనూ సల్మాన్ గత రెండు సినిమాలు భజరంగి భాయిజాన్.. సుల్తాన్ రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన నేపథ్యంలో ట్యూబ్ లైట్ మీద అంచనాలు పెరిగిపోయాయి. బయ్యర్లు భారీ రేట్లకు సినిమాను కొన్నారు. తీరా చూస్తే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్లే దారుణమైన వసూళ్లొచ్చాయి. తొలి రోజు నుంచే వసూళ్లు ఆశాజనకంగా లేవు. వీకెండ్ తర్వాత సినిమా చతికిలబడింది.

టాక్ తో సంబంధం లేకుండా వీకెండ్లోపే రూ.100 కోట్ల మార్కు అందుకుంటుంటాయి సల్మాన్ సినిమాలు. కానీ ఈ సినిమా వారం తర్వాత కూడా ఈ మార్కును దాటలేదు. ఫుల్ రన్లో ‘ట్యూబ్ లైట్’ రూ.130 కోట్లకు మించి వసూలు చేసే అవకాశాలు కనిపించలేదు. ఈ సినిమాను అమ్మిన రేట్లకు.. వస్తున్న వసూళ్లకు పొంతన లేదు. రూ.300 కోట్లకు పైగా గ్రాస్ సాధిస్తే తప్ప బయ్యర్లు బయటపడే అవకాశం లేదట. ప్రస్తుత కలెక్షన్ల ప్రకారం చూస్తే బయ్యర్లు నిండా మునిగినట్లే అంటున్నారు. ఐతే బాలీవుడ్లో బయ్యర్లతో ఒప్పందాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయితే.. రిబేట్లు ఇస్తుంటారు. ఆ రకంగా చూస్తే బయ్యర్లు కొంచెం సేవ్ అయినట్లే కానీ.. అయినప్పటికీ నష్టాలైతే పెద్ద స్థాయిలోనే ఉండబోతున్నాయి.

,  ,  ,  ,  ,