Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2017 11:30:13
facebook Twitter Googleplus
Photo

అల్లు శిరీష్ తన కొత్త సినిమా ఒక్క క్షణం తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మనోడు విఐ ఆనంద్ డైరక్షన్లో ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నాడని గతంలోనే చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు పోస్టర్ తో ఆ విషయాన్ని ప్రూవ్ చేయాలన్ని ప్రయత్నిస్తున్నారు.

ఆల్రెడీ రెండు కాలని అగ్గిపుల్లలను టైటిల్లో చూపించి.. సినిమాలో లవ్ వర్సెస్ డెస్టినీ అంటూ ఏదో ఉందని గతంలోనే చూపించారు. ఇప్పుడు ఏమంటున్నారంటే.. మనోడో పగిలే అద్దాలను చీల్చుకుంటూ తన గాళ్ ఫ్రెండ్ (హీరోయిన్ సురభి)తో కలసి అలా డెస్టినీని ఎదిరిస్తాడు అనే తరహాలో లుక్ ఉంది. ఎక్కడికి పోతావా చిన్నవాడా పోస్టర్ ను చూసినప్పుడు ఎలాగైతే డిఫరెంట్ అనిపించిందో.. ఇప్పుడు శిరీష్ ఒక్క క్షణం కూడా అలాగే ఉండేలా చూసుకున్నాడు విఐ ఆనంద్.

ఇకపోతే అనూహ్యంగా డిసెంబర్ బరిలోకి దిగాడు అల్లు వారబ్బాయ్. ప్రొమోషన్లు చకచకా స్టార్ట్ చేసి మనోళ్లు డిసెంబర్ 23న లేదంటే 29న సినిమాను రిలీజ్ చేస్తారట.

,  ,  ,  ,  ,