Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2015 11:20:39
facebook Twitter Googleplus
Photo

రవితేజ నటిస్తున్న 'బెంగాల్ టైగర్' చిత్రానికి మరింత గ్లామర్ తోడవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో తమన్నా, రాశిఖన్నా వంటి అందాలభామలు నటిస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు కొత్తగా మరో అందాన్ని జోడించారు. గతంలో 'యువత', 'రైడ్', 'కందిరీగ' వంటి సినిమాల్లో నటించిన గ్లామరస్ హీరోయిన్ అక్ష కూడా ఇందులో ఓ కీలక పాత్రకు తాజాగా ఎంపికైంది. దీంతో మొత్తం ముగ్గురు కథానాయికలతో ఈ సినిమా మరింత క్రేజ్ తెచ్చుకుంటోంది. 'రచ్చ' ఫేం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

,  ,  ,  ,  ,