Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2016 17:44:53
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ తన అభిమానులకు చాలా ప్రాధాన్యతనిస్తాడు. వాళ్లపై ఓ చిన్న మచ్చ కూడా రాకుండా జాగ్రత్తపడుతూ ఉంటాడు. షూటింగ్ స్పాట్ కి వచ్చినవారితో ఫోటోలు దిగేందుకు ఏమాత్రం సంశయించడు. సరికదా.. ఎవరైనా సరే భుజం మీద చెయ్యేసి మరీ ఫోటోలకు ఫోజులిచ్చేస్తుంటారు అల్లు అర్జున్. రీసెంట్ గా అలాగే ఓ ఆర్గనైజేషన్ కి సంబంధించిన పలువురు అనాథలు బన్నీని కలిసేందుకు షూటింగ్ స్పాట్ కు వచ్చారు.

ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. "అనాథలైన ఈ చిన్నారులు షూటింగ్ సమయంలో నన్ను కలిసేందుకు వచ్చారు. మంచి కలలు పేరుతో నడుస్తున్న ఆర్గనైజేషన్ ను సపోర్ట్ చేస్తున్న ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లకు కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశాడు. ఇలా తనను కలవాలని అనుకునేవారిని ఏ మాత్రం నిరాశపరచడు అల్లు అర్జున్. రీసెంట్ గా విజయవాడకు చెందిన ఓ 64 ఏళ్ల అవ్వ.. బన్నీని కలవాలని కోరకుంటే.. చక్కగా ఫ్లైటెక్కి ఇంటికెళ్లిపోయాడు. అలాగే ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను కూడా తన ఫ్యాన్స్ తో కలిసి చేసుకున్నాడు. తన అత్తారింటి దగ్గర ఓ చిన్నారి ఫ్యాన్ ని తోసేస్తున్న వారిపై విరుచుకు పడ్డాడు. అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తన సేవానిరతని చాటుతున్నాడు.

దేశంపై ప్రేమ చూపించే బన్నీ.. ఏ షార్ట్ ఫిలిం ద్వారా తన దేశభక్తిని కూడా చాటాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సరైనోడు చేస్తున్నాడు బన్నీ. ఈ సంక్రాంతికి సరైనోడు వర్కింగ్ టైటిల్ పై రూపొందుతున్న మూవీకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. టైటిల్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

,  ,  ,  ,