Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2016 13:32:01
facebook Twitter Googleplus
Photo

జనతా గ్యారేజ్ కి మించిన మూవీ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఎన్టీఆర్ చాలా కేర్ఫుల్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అనేక మంది డైరెక్టర్లు చెప్పిన స్టోరీలు విన్న తర్వాత.. ఎట్టకేలకు బాబీ చెప్పిన ఓ స్టోరీకి యంగ్ టైగర్ కన్విన్స్ అయ్యాడని.. ఇక అనౌన్స్ మెంట్ వచ్చేస్తుందనే టాక్ వినిపించింది.

ఇంకా ఫైనల్ కాక ముందే ఈ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిపోయిందట. జూనియర్ కి బాబీ చెప్పిన ఈ స్టోరీ కోనవెంకట్ ది అని తెలుస్తోంది. ఈయన ఇప్పటికే ఈ స్టోరీని అభిషేక్ బచ్చన్ కి వినిపించడమే కాదు.. ఆ కథకు సంబంధించి అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడట. ఇప్పుడీ స్టోరీ ఎన్టీఆర్ కి నచ్చడంతో.. డీల్ క్యాన్సిల్ చేసుకుందామని అభిషేక్ ని అప్రోచ్ అయితే.. గుర్రుమన్నాడట ఆ బాలీవుడ్ హీరో. ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో చేస్తానని.. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే ఉద్దేశ్యంలేదని తేల్చేశాడట.

దీంతో ఏం చేయాలో పాలుపోని కోన.. వర్మ ద్వారా రాయబారం నడిపేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఎన్టీఆర్ ఈ సినిమా చేయాలంటే.. బచ్చన్ ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలన్న మాట. ఇది జరిగేపని కాదని.. ఎన్టీఆర్ వేరే ఆప్షన్ కి వెళ్లిపోతున్నాడని ఇండస్ట్రీ టాక్.

,  ,  ,  ,  ,  ,