Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2015 13:42:24
facebook Twitter Googleplus
Photo

కాప్ స్టోరీలకు టాలీవుడ్ లో కొదవేం లేదు. ఇప్పుడున్న హీరోలంతా ఏదో ఒకరోజు పోలీస్ అవతారాల్లో దర్శనమిచ్చినవారే. అయితే బన్ని మాత్రం ఇంతవరకూ ఓ పూర్తి స్థాయి పోలీస్ పాత్రలో కనిపించిందే లేదు. రేసుగుర్రం సినిమాలో ఓ పావుగంట ఎపిసోడ్ లో పోలీస్ గా కనిపించి హల్ చల్ చేశాడు. ఆ ఎపిసోడ్ కి జనాల్లోంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే బన్నిలాంటి ఎనర్జిటిక్ హీరో ఓ పూర్తి స్థాయి కాప్ రోల్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది?

ఈ టైపులో ఆలోచించిన బోయపాటి శ్రీను ఈసారి అతడిని ఏకంగా పోలీస్ అధికారిగా చూపించేస్తున్నాడు. ఇప్పటికే సినిమా ఆన్ సెట్స్ ఉంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ లోనే కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఎక్కడా ఈ సినిమాలో బన్ని క్యారెక్టర్ ఏంటి? అన్నది రివీల్ కాకుండా మ్యానేజ్ చేస్తున్నారంతా.

అయితే క్లోజ్ సోర్సెస్ వివరాల ప్రకారం బన్ని ఈ చిత్రంలో కాప్ రోల్ పోషిస్తున్నాడని తెలిసింది. శ్రీకాంత్ - రాజీవ్ కనకాల కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రకూల్ ప్రీత్ సింగ్ - క్యాథరిన్ థెరిస్సా కథానాయికలుగా ఆడిపాడుతున్నారు. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

,  ,  ,  ,