Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2017 12:31:15
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు సోదరి మంజుల దర్శకురాలిగా మారేందుకు సిద్ధమైన సంగతి గతంలోనే చెప్పుకున్నాం. జెమిని కిరణ్ నిర్మాతగా రూపొందబోయే ఈ చిత్రాన్ని సందీప్ కిషన్ హీరోగా.. మలయాళ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందించబోతున్నట్లు గతంలో చెప్పారు మేకర్స్.

అయితే.. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ మారిపోయిందని తెలుస్తోంది. సందీప్ కిషన్ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయడంలో సాయిపల్లవి విఫలమైందట. అందుకే ఆమె ప్లేస్ లో అమైరా దస్తూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారట దర్శకురాలు మంజుల. సాయి పల్లవి బిజీ షెడ్యూల్ కారణంగానే ఇలా జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ కి జోడీగా ఫిదా మూవీలో నటిస్తున్న సాయిపల్లవి.. నానితో వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందబోయే ఎంసీఏ చిత్రానికి సైన్ చేసింది. అక్కడే డేట్స్ విషయంలో క్లాష్ వచ్చిందట.

తనంతట తానే సినిమా నుంచి తప్పుకునేందుకు సాయిపల్లవి చేసిన ప్రతిపాదనను మేకర్స్ కూడా అంగీకరించారట. కొన్ని నెలల పాటు ఈమె డేట్స్ ఇచ్చే అవకాశం లేకపోవడంతోనే.. అనేకుడు ఫేమ్ అమైరా దస్తూర్ ను తెరపైకి తెచ్చారట మంజుల.

,  ,  ,  ,