Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jul-2016 11:03:53
facebook Twitter Googleplus
Photo

తెలుగు ప్రేక్షకులకు ?తొలిప్రేమ? అంటే పవన్‌కల్యాణ్ చిత్రం గుర్తొస్తుంది. ఇప్పుడు ?తొలిప్రేమలో? అంటూ మరో చిత్రం వస్తోంది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ?కయల్?. చంద్రన్, ఆనందిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని యాదాద్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ?తొలిప్రేమలో? పేరుతో తెలుగులోకి అనువదించారు. తమటం శ్రీనివాసగౌడ్, జయారపు రామకృష్ణ, గౌలిఖార్ శ్రీనివాస్ నిర్మాతలు. డి.ఇమాన్ స్వరపరిచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథి దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ - ??ప్రేమకథలో ఉండాల్సిన అన్ని భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉన్నాయి.

తమిళంలో ప్రభు సాల్మన్ తనకంటూ ఓ మార్క్ సృష్టించుకున్నాడు. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని పలు చిత్రాలు నిరూపించాయి. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను?? అన్నారు.

,  ,  ,  ,  ,