Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Sep-2016 12:42:29
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరోల్లో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన క్రేజ్ పెంచుకుంటున్న తీరు.. వెళ్తున్న రూట్ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కర్నాటకలో తెలుగు సినిమాలకు డైరెక్టుగానే ఆడియన్స్ ఉంటారు. కేరళలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సంపాదించేసుకున్న బన్నీ.. ఇప్పుడు తమిళనాడులో కూడా సత్తా చాటబోతున్నాడు. ఇందులో భాగంగానే లింగుస్వామితో తమిళ్-తెలుగు బై లింగ్యువల్ చేస్తున్నాడు అల్లు అర్జున్.

లింగుస్వామి-బన్నీ కాంబినేషన్ పై ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. కోలీవుడ్ హీరో సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో.. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై.. కొత్త ప్రొడక్షన్ నెం.12 అంటూ.. ఓ మూవీని లాంఛ్ చేశారు. 'నన్ను తమిళ సినీ ఇండస్ట్రీలోకి లాంఛ్ చేస్తున్న దర్శకుడు లింగుస్వామి.. నిర్మాత జ్ఞానవేల్ రాజాలకు థ్యాంక్యూ. నాకు స్వాగతం పలికిన తమిళ నాడు ప్రజలు- మీడియాకు కూడా థాంక్యూ' అంటూ బన్నీ ఓ ట్వీట్ పెట్టి మరీ.. తన ఎంట్రీని ఖాయం చేశాడు.

'వెరీ వెరీ వామ్ వెల్కం అల్లు అర్జున్. చెన్నై నీకు కొత్తేమీ కాదు. నీకు ఇదో ఎక్సైటింగ్ జర్నీ అవుతుంది. అంతా మంచే జరుగుతుంది' అంటూ సూర్య ఓ ట్వీట్ పెట్టగా.. దాన్ని రీట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు బన్నీ.

,  ,  ,  ,  ,