Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jan-2017 11:57:22
facebook Twitter Googleplus
Photo

హాట్ యాంకర్ అనసూయ.. బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా సెన్సేషనే. అటు సినిమాలను.. ఇటు టీవీ కార్యక్రమాలను.. మధ్యమధ్యలో సినిమా ఫంక్షన్స్ ను హ్యాండిల్ చేసేస్తూ తెగ బిజీగా ఉంది అనసూయ. అయితే.. ఈ భామకు మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150కి సంబంధించి ఓ సూపర్బ్ ఛాన్స్ మిస్ అయిందట.

మెగా మూవీలో భాగం కావడానికి అందరూ పడిగాపులు కాస్తుంటే.. చేతికొచ్చిన అవకాశం వదులుకోవాల్సి వచ్చిందని అనసూయ తెగ బాధపడిపోతోంది. ఇందుకు కారణం కూడా చెప్పింది. 'నేను జనవరి 4న విజయవాడలో ప్లాన్ చేసిన ఖైదీ నంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్ ను హోస్ట్ చేయాల్సి ఉంది. కానీ అనుకోకుండా ఆ కార్యక్రమం పోస్ట్ పోన్ అయింది. 7వ తేదీన నిర్వహిస్తామని చెర్రీ అండ్ టీం నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ అప్పటికే ఆ కాల్షీట్ నేను వేరే వాళ్లకు ఇచ్చేశాను' అని చెప్పింది అనసూయ.

కేవలం డేట్స్ ప్రాబ్లెంతో మెగాస్టార్ కంబ్యాక్ మూవీలో తను భాగం కాలేకపోయానని చెబుతోంది ఈ జబర్దస్త్ భామ. అయితే.. ఖైదీ నంబర్ 150 బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటా అని చెబుతూ విషెస్ చెప్పింది అనసూయ. చిరు మూవీ మిస్ అయింది కానీ.. మరో మెగా మూవీలో కనిపించనుంది. సాయిధరం తేజ్ తో కలిసి విన్నర్ మూవీలో స్పెషల్ సాంగ్ తో అలరించనుంది హాట్ యాంకర్ కం యాక్టర్ అనసూయ

,  ,  ,  ,  ,  ,