Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Oct-2016 11:29:19
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడున్న యాంకర్లుకు ఓవర్ యాక్షన్ ఎక్కువ. సుమ లాంటివాళ్ళు తప్పితే రెగ్యులర్ కనిపించే యాంకర్లు ఓవర్ యాక్షన్ చేయకుండా స్టేజ్ దిగరు. భాషపై పట్టుండదు. సమయస్పూర్తి మచ్చుకైనా కనిపించదు. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలీదు. ఒకొక్కసారి అవసరమా ఇది? అనిపిస్తుంది. నిన్న ఇజం ఆడియో వేడుకలో యాంకర్ అనసూయ తీరు కూడా ఇలానే వుంది.

కళ్యాణ్ రామ్ పూరి జగన్నాధ్ కలయికలో వస్తున్న ఇజం ఆడియో వేడుక జరిగింది. దీనికి యాంకర్ అనసూయ. ఈ వేడుకలో అనసూయకు ఓ ధర్మ సందేహం వచ్చింది. ఈ సినిమా టీజర్ లో ?డక్? అనే మాట పదే పదే వాడుతాడు కళ్యాణ్ రామ్. డక్ అంటే అంటే బాతు అని అర్ధం. అయితే దర్శకుడు పూరి దానికి స్పానిష్ అర్ధం వెదికి ఆ పదం రాశాడు. ఇది వరకే అది ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. స్పానిస్ లో డక్ అంటే పచ్చి బూతు. అయితే దీని గురించి ఏకంగా ఆడియో వేడుకలో అడిగింది అనసూయ.

ముందు కమెడియన్ అలీని కెలికింది. ?నాను డక్ అంటే బాతు అని తెలుసు, ఐనా నేను ఏం మాట్లాడిన తప్పు అయిపోతుంది. దాని గురించి డైరెక్టర్ గారినే అడుగు? అని చెప్పాడు. దీంతో పూరి దగ్గరకు వెళ్ళింది అనసూయ. పూరిది అంతా డైరెక్ట్ ఎటాక్ కదా. మరో ఆలోచన లేకుండా ??డక్ అంటే బాతు కాదు బూతు? అని సభా ముఖంగా చెప్పాడు. అప్పటికి గానీ అనసూయ సరదా, సందేహం తీరలేదు

,  ,  ,  ,  ,