Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2017 11:04:29
facebook Twitter Googleplus
Photo

కుర్ర హీరో రాజ్ తరుణ్ జోరు కంటిన్యూ చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే కిట్టు ఉన్నాడు జాగ్రత్త అంటూ మంచి సినిమానే అందించాడు. పరీక్షల సీజన్ కారణంగా అనుకున్న స్థాయిలో ఫేర్ చేయలేదు కానీ.. ఈ సినిమాకి పర్లేదనిపించే స్థాయిలోనే వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ అంధగాడు అంటూ వచ్చేస్తున్నాడు రాజ్ తరుణ్.

హీరో గుడ్డివాడి కేరక్టర్ తో రూపొందిన అంధగాడు టీజర్ ఆకట్టుకుంది. హిట్ పెయిర్ గా గుర్తింపు పొందిన రాజ్ తరుణ్- హెబ్బా పటేల్ ల జోడీ ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. స్టోరీ విషయంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే జోడించినట్లు కనిపిస్తోంది. 'కళ్లు లేనప్పుడు ఎప్పుడొస్తాయని ఎదురుచూశాను. ఇప్పుడు ఎప్పుడు పోతాయ్ అని వెయిట్ చేస్తున్నా' అంటూ రాజ్ తరుణ్ వాయిస్ తో మొదలుపెట్టిన టీజర్ ఆద్యంతం.. ఫన్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. తాను గుడ్డివాడినని చెప్పకుండానే హీరోయిన్ తో లవ్ స్టోరీ నడిపే సీన్స్ ఆకట్టుకుంటాయి.

అంతలోనే నా జీవితంలో విలన్ ఎంటర్ అయ్యాడు అంటూ రాజేంద్రప్రసాద్ ను చూపించినప్పటి నుంచి టీజర్ యాంగిల్ మారిపోతుంది. దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ కామెడీకి యాక్షన్ ప్లస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి మంచి సినిమానే సిద్ధం చేసినట్లుగా అనిపించడం ఖాయం

,  ,  ,  ,  ,