Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-May-2015 11:47:15
facebook Twitter Googleplus
Photo

బలమైన కథా కథనాలతో దర్శకుడు కొరటాల శివ ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కథానాయకుడు మహేష్ బాబు కావడం వలన ఎంతోమంది ప్రేక్షకుల చూపు ఈ సినిమాపై వుంది. కథానాయికగా శృతిహాసన్ సందడి చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. మొదటినుంచి కూడా ఈ సినిమాకి 'శ్రీమంతుడు' అనే టైటిల్ నిర్ణయించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. దాంతో ఈ సినిమాకి సంబంధించిన సమాచారమంతా కూడా ఈ పేరుమీదే అభిమానుల ముందుకి వెళ్లింది.

అయితే ఇటీవల 'మగాడు' అనే టైటిల్ రంగం మీదకి వచ్చింది. శ్రీమంతుడు అనే టైటిల్ సాఫ్ట్ గా ఉందనీ .. అది క్లాస్ ఆడియన్స్ కి మాత్రమే రీచ్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా వుండటం కోసం 'మగాడు' టైటిల్ సరైనదిగా భావించారనే ప్రచారం జరిగింది. అయితే కథప్రకారం ఈ సినిమాకి 'శ్రీమంతుడు' అనే టైటిలే సరైనదనీ, ఆ టైటిల్ నే ఖరారు చేస్తున్నామని దర్శకుడు స్పష్టం చేశాడు. దాంతో ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ విషయంలో నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది.

,  ,  ,  ,  ,  ,  ,