Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jan-2016 18:23:09
facebook Twitter Googleplus
Photo

23.01.2016న నిర్మాత కె.అశోక్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ గంటా శ్రీనివాస‌రావుతో ?ఫిల్మ్ నగర్ క్లబ్?లో ఏర్పాటు చేసిన ?Cocktail-Dinner Meeting?కు ఎంపిక చేసిన అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానించటంలో ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరం లేదు కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ శాతం తెలియచేయకుండా, అతికొద్ది మందిని మాత్రమే పిలిచి నిర్వహించిన మీటింగ్ invitationలో ?TELUGU FILM INDUSTRY GET-TOGETHER? అని పేర్కొనటం తీవ్ర అభ్యంతరకరం.

'ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్' సభ్యుల వినోదం కోసం విశాఖలో 15ఎకరాలు 'అడ్వాన్స్ పొజిషన్' తీసుకొని మరో 6ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరిన మీదట, ఇదే అంశం పై మీడియాలో ?'ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ విన్యాసం.. సభ్యుల్లేకుండానే 'వినోద కేంద్రం'? 'నవ్యాంధ్రలో సినిమా పరిశ్రమ అభివృద్ధి' పేరిట AP సీఎం ను తప్పుదారి పట్టించినట్లు తెలుస్తోంది.. 24శాఖలకు శిక్షణ ఇస్తాం, మౌలిక వసతులు కల్పిస్తాం అని 'ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్' కోరింది కానీ ఈ సొసైటీ బైలాస్ లో ఈ అంశాలు ఎవీలేవు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సినీ కార్మికుల సంక్షేమంతో ?కల్చరల్ సెంటర్?కు ఎటువంటి సంబంధం లేదు. రోజు సాయంత్రం విందు, వినోదాలు, సినిమా ప్రదర్శనలు, ఫంక్షన్లకు మాత్రమే ఇది వేదిక. సినీ జనాల వినోదం (రిక్రియేషన్) కోసం ఏర్పాటు చేసుకున్న క్లబ్బు??? ??సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) వచ్చాకే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని కలెక్టర్ తెలిపినట్లు??? విమర్శలు రావటం జరిగింది

తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ లో అభివృద్ధి పర్చటానికి అప్పటి ప్రభుత్వాలు 1978లో ?Film Nagar Cooperative Housing Society?కి 91.25ఎకరాలు, ఆ తదుపరి Cine Workers Cooperative Housing Society ?Chitrapuri Colony? కొరకు 67 ఎకరాలు కేటాయించటం జరిగింది. మౌలిక వసతులు ఏర్పడిన పిదప, పరిశ్రమ స్థిర పడిన 16 సంవత్సరాల తర్వాత మాత్రమే ఫిల్మ్ నగర్‌లో 3? ఎకరాలలో ఖాళీగా ఉన్న పార్క్ స్థలాన్ని పరిశ్రమ సభ్యుల ?రిక్రియేషన్? కోసం 'ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్'కు అనుమతించింది. Hyderabadలో 3? ఎకరాలలో ?క్లబ్? ఉండగా విశాఖలో 21ఎకరాలు పొందాలనే ప్రయత్నంపై విమర్శలు వస్తున్నందున, Vizagలో సినిమా పరిశ్రమ అభివృద్ధి ?అంశం? తెలుగు చిత్ర పరిశ్రమదే కానీ, చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులు షుమారుగా పది శాతం పైన మాత్రమే కల్గిన ?రిక్రియేషన్ క్లబ్?ది ఎంత మాత్రం కాదు. సాంకేతికంగా అభివృద్ది జరిగిన మీదట, పరిశ్రమ సభ్యుల రిక్రియేషన్ కోసం హైదరాబాద్ లో ఏర్పడినట్లుగా విశాఖలో ?కల్చరల్ సెంటర్'(రిక్రియేషన్ క్లబ్)ను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వాన్ని తప్పు దారి పట్టించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని సర్వత్రా విమర్శలు వస్తున్నందున, విశాఖలో పరిశ్రమ అభివృద్ధి భాద్యతను ?పరిశ్రమ?కు మాత్రమే అప్పగించావల్సిందిగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం.

మీడియాలో వచ్చిన క్లిప్స్ తో పాటుగా, 25.1.16న ?తెలుగు ఫిల్మ్ ఛాంబర్-?ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్? మీటింగ్ లో ఆమోదించిన తీర్మానం ప్రతిని జతచేస్తున్నాం.

- Producer Members,Film Chamber&Producers Council.

,  ,  ,  ,  ,