Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2015 11:38:29
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ గురించి అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్న సంగతి మనకు తెలుసు. దీనికి తోడు, మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి ఇటీవల మీడియాలో పలు వార్తలు కూడా వచ్చాయి. ఫలానా నిర్మాత ఆయనతో సినిమా తీస్తున్నాడని, దానికి టైటిల్ కూడా నిర్ణయించేశారని... ఇలా రకరకాల వార్తలు రాజ్యమేలాయి. ఈ నేపథ్యంలో తనయుడి ఎంట్రీపై బాలకృష్ణ తాజాగా క్లారిటీ ఇచ్చారు. "మోక్షజ్ఞను 2017లో పరిచయం చేయాలనుకుంటున్నాం. అంటే ఇంకా చాలా టైం వుంది కదా! అందుకే, ఇంకా దర్శకుడు ఎవరు? కథ ఏమిటి? వంటివి ఏమీ అనుకోలేదు" అని చెప్పారు. అప్పుడప్పుడు తన సినిమాల గురించి తనయుడితో చర్చిస్తుంటానని, తను శ్రద్ధగా వింటాడని బాలయ్య చెప్పారు.

,  ,  ,  ,  ,