Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Dec-2017 14:18:18
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్లు మోడర్న్ డ్రెస్సులేస్తే ఎలా ఆశ్చర్యపోతామో.. మోడర్న్ ఇమేజ్ ఉన్న కథానాయికలు ట్రెడిషనల్ లుక్ లోకి మారినా అంతే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు తమిళ హీరోయిన్ ఆండ్రియా జెరెమీని చూసి కూడా సోషల్ మీడియాలో జనాలు అలాగే ఆశ్చర్యపోతున్నారు. ఆండ్రియా జెరెమీ అనే పేరు ఎంత మోడర్న్ గా ఉంటుందో.. ఆమె ఎంచుకునే పాత్రలు.. తన లుక్స్ కూడా అంతే మోడర్న్ గా కనిపిస్తాయి. ‘యుగానికి ఒక్కడు’ దగ్గర్నుంచి ఇటీవలే విడుదలైన ‘గృహం’ వరకు అన్ని సినిమాల్లోనూ ఆండ్రియా చాలా ఆధునికంగానే కనిపించింది. మోడర్న్ లుక్ లో.. హాట్ హాట్ గా కనిపించి కుర్రాళ్ల మనసు దోచింది.

సినిమాల్లోనే కాదు.. బయట కూడా ఆండ్రియా మోడర్న్ ఔట్ ఫిట్ లోనే కనిపిస్తుంటుంది. అలాంటమ్మాయి తన కొత్త సినిమా కోసం ఎత్తిన అవతారం చూసి అందరూ షాకైపోతున్నారు. చీరకట్టులో పూర్తి సంప్రదాయబద్ధంగా తయారైందామె. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాడా చెన్నై’ సినిమా కోసమే ఆమె ఈ అవతారం ఎత్తిందని అంటున్నారు.

,  ,  ,  ,