Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2017 09:53:40
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ 25వ సినిమా కాబట్టి.. దీనిని ల్యాండ్ మార్క్ మూవీ గా చూస్తూ.. అభిమానులు కూడా ఎంతో ఓర్పుగా ఈసినిమా ఫస్ట్ లుక్ కోసం.. ట్రైలర్ కోసం.. అసలు టైటిల్ ఏంటో తెలుసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియజేయడానికి ఒక పోస్టర్ విడుదల చేశారు.

#pspk25 ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను నవంబర్ 27న విడుదల చేస్తాం అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. గతంలో రిలీజ్ చేసిన ఒక పోస్టర్ అలాగే ఇప్పుడు ఇచ్చిన ఈ పోస్టర్ కూడా పవన్ ను సిలౌట్ లోనే చూపిస్తున్నాయి. అదేనండీ.. నీడలోనే ఉంచారు. అయితే పవన్ వెలుగులోకి వస్తాడని ఇప్పటివరకు చాలా డేట్లు వచ్చినా కూడా.. ఇప్పుడు మాత్రం అఫీషియల్ గా ఈ తేదీని ప్రకటించారు. ఆ రోజు ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఈ నీడలోని పవర్ స్టార్ తో అభిమానులు సరిపెట్టుకోవాల్సిందే.

త్రివిక్రమ్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్ మరియు అనూ ఎమ్మానుయేల్ నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,