Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Dec-2017 10:26:08
facebook Twitter Googleplus
Photo

పటాస్ మూవీ తీసి.. టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. సాయి ధరం తేజ్ తో సుప్రీమ్.. రవితేజతో రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ కూడా కంప్లీట్ చేసేశాడు. ప్రస్తుతం ఓ మల్టీ స్టారర్ కి ప్రిపేర్ అవుతున్న ఈ దర్శకుడు.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది.

గత కొంతకాలంగా బాలయ్య- అనిల్ రావిపూడిలు చర్చలు నిర్వహిస్తుండడంతో.. ఇలాంటి టాక్ బయలుదేరింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉన్నా.. ఇంకా ప్రాజెక్టు ఖాయం కాలేదని లేటెస్ట్ టాక్. జస్ట్ సినిమా చేద్దామని అనుకోవడం తప్ప.. ఇంకా స్టోరీ లైన్ వరకూ కూడా కథ రాలేదట. పైగా ప్రస్తుతం తను ప్రకటించిన ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్టేషన్) చిత్రం కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకునే పనుల్లో ఉన్నాడు అనిల్ రావిపూడి. మరోవైపు వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు బాలయ్య.

ఇప్పటికే బాలయ్య 104వ చిత్రం వచ్చే ఏడాది జూన్ 10న ప్రారంభవముతుందని.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందనే ప్రకటన కూడా వచ్చేసింది. దీనికి తోడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా పెండింగ్ ఉంది. దాని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేస్తారట బాలయ్య. అంటే 2019 సెకండాఫ్ లో ఈ కాంబో ఉంటుందన్న మాట.

,  ,  ,  ,  ,