Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Nov-2016 10:37:05
facebook Twitter Googleplus
Photo

జానీ మాస్టర్.. ఇప్పుడైతే తెలుగు సినిమా ప్రేక్షకులకు.. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు పరిచయం అక్కర్లేని కొరియోగ్రాఫర్. వరుసగా మెగా హీరోల సినిమాలకు డ్యాన్స్ కంపోజ్ చేస్తూ.. టాప్ రేంజ్ లోకి చేరిపోయాడు. ఇప్పుడీ డ్యాన్స్ కంపోజర్ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్150కి స్టెప్స్ సమకూరుస్తున్నాడు.

ఖైదీ నెంబర్ 150 యూనిట్ స్లొవేనియాలో సాంగ్ షూటింగ్ లో ఉంది. చిరుతో పాటు కాజల్ కూడా సూపర్బ్ సాంగ్ కు చిందులు వేస్తుంటే.. జానీ మాస్టర్ డ్యాన్స్ అందిస్తున్నాడు. 'ఇప్పుడు నేను నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా జీవితం అంతా మెగాస్టార్ చిరంజీవి స్టెప్స్ చూస్తూనే పెరిగాను. ఇప్పుడు ఆయనకే స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాను. నేను క్రియేట్ చేసిన స్టెప్స్ లో ఆయన్ను చూసుకుంటుంటే నా మనసెంతో అద్భుతమైన భావనతో నిండిపోయింది.' అంటూ కళ్లనీళ్లు పెట్టేసుకున్నాడు జానీ మాస్టర్.

అభిమాని హీరోని అంత దగ్గరగా చూస్తూ.. ఆయన డ్యాన్సులను చూసి డ్యాన్స్ అంటే ప్రేమ పెంచుకుని.. డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగాక.. ఆయనకే డ్యాన్స్ కంపోజ్ చేస్తే ఎలా ఉంటుందో.. ఇప్పుడు జానీ మాస్టర్ ను చూస్తే అర్ధమవుతుంది కదూ!

,  ,  ,  ,