Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2017 11:22:07
facebook Twitter Googleplus
Photo

కమర్షియల్ హిట్టు పడితే చాలు దర్శకుడిగా మరో ఛాన్స్ ఈజీగా అందుకోవచ్చు. కానీ వరుసగా హ్యాట్రిక్ పడితే ఇక లక్కు కిక్కే వేరు. ప్రస్తుతం అనిల్ రావిపూడి అదృష్టం కూడా అలానే ఉంది. పటాస్ - సుప్రీం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ ఇటీవల వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాతో ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని తీసే డైరెక్టర్ గా మారిపోయాడు. మనోడికి ఇప్పుడు ఆఫర్లు బాగానే దక్కుతున్నాయి.

ఇప్పటికే అగ్ర నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చారని స్టార్ హీరో లు ఆఫర్ చేశారని ఇలా రోజుకో న్యూస్ వస్తోంది. ఆల్రెడీ గీతా ఆర్ట్స్ వారు పిలిచి సినిమా ఇచ్చారు అని కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. అనిల్ మాత్రం ఇంకా ఎవరితో అనేది క్లియ్యర్ గా చెప్పలేదు. అయితే ఆయన సన్నిహితుల సమాచారం నుండి మరోక న్యూస్ అందింది. రీసెంట్ గా ఈ దర్శకుడు యువ హీరో నితిన్ కు ఒక మంచి మాస్ కంటెంట్ ఉన్న కాన్సెప్ట్ ను చెప్పాడట. నితిన్ కూడా సినిమా చేయడానికి ఒకే అన్నట్లు తెలుస్తోంది. అఆ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత లై సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అందుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ కథ కోసం ఎదురుచూస్తుండగా అనిల్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడాని తెలుస్తోంది. అనిల్ కూడా ఇది వరకే ఆల్ రెడీ కొన్ని కథలను రాసి పెట్టుకున్నానని చెప్పాడు. అందులో నితిన్ కి సెట్ అయ్యేలా ఒక కథ ఉండడంతో తొందరలోనే ఆ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాడట.

,  ,  ,  ,