Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2017 15:42:44
facebook Twitter Googleplus
Photo

సౌత్ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఈ కుర్రాడు. వై దిస్ కొలవెరీతో క్రేజ్ తెచ్చుకుని.. ఆ తర్వాత కూడా తన స్పీడ్ ను కంటిన్యూ చేశాడు. అయితే.. ఈ కంపోజర్ తెలుగు అరంగేట్రం బాగానే ఆలస్యమైంది. మొత్తానికి పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీతో తెలుగు అరంగేట్రం చేస్తున్నాడు అనిరుధ్.

ఇప్పుడీ సినిమాకి సంబంధించి.. దాదాపుగా తన పని పూర్తి చేసేశాడట అనిరుధ్. ఒక్క రొమాంటిక్ సాంగ్ కు మాత్రమే అనిరుధ్ ఇంకా మ్యూజిక్ ఇవ్వాల్సి ఉందని.. మిగిలిన ఆల్బం అంతా అప్పగించేశాడని తెలుస్తోంది. ఈ కుర్రాడు అందించే పాటలపై.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో చాలానే అంచనాలు ఉన్నాయి. వీటిని ఎంతవరకూ అందుకుంటాడనే విషయం తెలియడానికి చాలా టైం ఉంది కానీ.. అసలు మధ్యలో తప్పుకోకుండా పూర్తి చేయడమే మొదట ఊరట చెందాల్సిన విషయం.

మొదట రామ్ చరణ్ బ్రూస్ లీ మూవీకి సైన్ చేసి తర్వాత తప్పుకున్న అనిరుధ్.. ఆ తర్వాత అఆ చిత్రానికి కూడా ఇలాగే చేశాడు. దీంతో.. ఈ సారి కూడా ఇలాంటి పని చేస్తే.. కట్టేసి మరీ పని చేయిస్తానని సమంత ఓ సందర్భంలో బెదిరించేసింది.

,  ,  ,  ,  ,