Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Oct-2016 12:56:50
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికే రామ్ చరణ్ అండ్ ఉపాసన పర్సనల్ లైఫ్ గురించి అనేక కామెంట్లు గాసిప్పులూ వినిపిస్తూనే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కిడ్స్ గురించి మాత్రం తెగ వినబడుతోంది. తనతోపాటే పెళ్లి చేసుకున్న తోటి హీరోలు అందరూ తండ్రులు అయిపోతుంటే.. రామ్ చరణ్ మాత్రం ఇంకా ఎందుకు వద్దని అనుకుంటున్నాడు అంటూ చాలామంది కామెంట్లు చేయడం విన్నాయం. అయితే దీని గురించి ఉపాసన ఇచ్చిన ఆన్సర్ మాత్రం దిమ్మతిరిగిపోయింది.

''ప్లీజ్.. నేను ఇప్పుడే చాలా కష్టపడి వెయిట్ తగ్గాను. మళ్ళీ పిల్లలు అంటే మాత్రం చాలా వెయిట్ పెరుగుతాను. కష్టమే. అలాగే నాకు ఎప్పుడైతే పిల్లలు కావాలని అనుకుంటానో అప్పుడు నా వెనుకాల మొత్తం అపోలో ఉంది. సో ప్రాబ్లమ్ లేదు. అలాగే పిల్లలు అనేది పర్సనల్ విషయం. ఇంకాపోతే మా సొంత ఇల్లు ఇప్పుడే కట్టుకుంటున్నాం. అది రెడీ అవ్వాలి. ఆ తరువాత నేను చరణ్ తో చాలా టైమ్ స్పెండ్ చేయాలి. ఆ తరువాతే పిల్లలు'' అని సెలవిచ్చింది మెగా డాటర్ ఇన్ లా. చరణ్ అండ్ ఉపాసనల కిడ్స్ గురించి వర్రీ అయ్యేవారంతా ఇక కూల్ గా ఉండొచ్చు మరి.

ఇకపోతే రామ్ చరణ్ తో డైవర్స్ అనే రూమర్ గురించి మాట్లాడుతూ.. ''అసలు మేం కనుక డైవర్స్ తీసుకుంటే.. ఖచ్చితంగా మేమే ముందు మీడియాకు చెబుతాం. మేమే రివీల్ చేస్తాం. అందులో భయపడేది ఏముంది. మేమిద్దరం అన్నింటికంటే ముందు బెస్ట్ ఫ్రెండ్స్. సో రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు'' అంటూ చెప్పింది ఉపాసన.

,  ,  ,  ,